Breaking News

సంపూర్ణ అంధత్వ నిర్ములన ప్రభుత్వం లక్ష్యం. కంటి వెలుగు తరహ పథకం తెలంగాణ లో మినహా ప్రపంచం లో ఎక్కడా లేదు. -మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్.

130 Views

 సంపూర్ణ అంధత్వ నిర్ములన ప్రభుత్వం లక్ష్యం అని గజ్వేల్ మండలం బంగ్లా వెంకట పూర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెండే మధు తో కలిసి ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భౌతికంగా చూపు కోల్పోయిన వారికి తిరిగి చూపు ప్రసాదించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మహోన్నత లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమమే కంటి వెలుగు అన్నారు.మానవ శరీరం లో అన్నిటి కంటే ప్రధానమని తెలిసి కూడా కంటి చూపు పట్ల నిర్లక్ష్యం వహిస్తూ శాశ్వతం గా చూపు కోల్పోతున్న లక్షలాది మంది ని చైతన్య పరిచే,అదుకోవాలనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనల  నుండి కంటి వెలుగు కార్యక్రమం పుట్టుకొచ్చింది అని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచం లోనే ఎక్కడా లేదన్నారు. చాలా మంది తమకు చూపు తక్కువ అయిందని తెలిసి కూడా, ఆసుపత్రి కి వెళ్ళడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారని, వారి కోసమే కేసీఆర్ నేరుగా గ్రామాల్లోకి వెళ్లి శిబిరాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారని అన్నారు.వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న కంటి వెలుగు ఉద్యమం లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. తెలంగాణ లో కేసీఆర్ ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం దేశం మొత్తానికి వెలుగు నిస్తుంది అని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాపిరెడ్డి ఎంపీటీసీ అన్వర్ బేగం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సింలు, మండల ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, ఉప సర్పంచ్ స్వరూప, గ్రామ పార్టీ అధ్యక్షుడు రవీందర్ గౌడ్, డాక్టర్లు,ఆశావర్కర్లు ,నాయకులు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *