
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం కొత్తపేట గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ నిమ్మ వెంకట్రాం రెడ్డి గారి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత పశు వైద్య శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది. శిబిరంలో 22 నల్ల పశువులకు 11 తెల్ల పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్స చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం ఎంపీటీసీ వాజిదా అయూబ్ మరియు వార్డ్ మెంబర్స్ గ్రామస్తులు సిబ్బంది డాక్టర్ శ్వేతా , విఏ శ్రీను, ఓఎస్ హరిప్రసాద్, గోపాలమిత్ర లు యాదయ్య స్వామి, గ్రామ రైతులు పాల్గొన్నారు




