కోతుల దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన జాగిరి బాలలక్ష్మి55 మంగళవరం సాయంత్రం ఐదు గంటలకు తన ఇంటి ముందర కూర్చుండగా ఒక్కసారిగా కోతుల గుంపు ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వెంటనే మహిళను ఎల్లారెడ్డిపేట ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా డాక్టరు చూసి సిరిసిల్లాకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. అనంతరం సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహిళకు భర్త శంకరయ్య గౌడ్ గీతా కార్మికుడు కాగా అనారోగ్యంతో మంచానపడ్డాడు. తమ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.




