ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ జెడ్పిటిసి కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు

163 Views

ముఖ్యమంత్రి కెసిఆర్ , రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు

ప్రజా ప్రతినిధులకు బిఆర్ ఎస్ పార్టీ నాయకులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు

బిఆర్ ఎస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు శ్యామ మంజుల ఆధ్వర్యంలో రాఖీ వేడుకలు

ఎల్లారెడ్డిపేట ఆగష్టు 31 :

ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ జడ్పిటిసి కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు బిఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు నాయకులకు రాఖీలు కట్టి స్వీట్లు అందజేసి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు,
ఈ సందర్భంగా ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , బాకూరుపల్లి సర్పంచ్ మంజుల రాజు నాయక్ , ఎంపీటీసీ సభ్యురాలు ఎలగందుల అనసూయ నరసింహులు , మండల మహిళా అధ్యక్షురాలు అప్సరా , మండల కోశాధికారి జూలేఖ , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు శ్యామ మంజుల , బిఆర్ ఎస్ పార్టీ మహిళా నాయకురాలు కవిత కలిసి జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు లతో పాటు ప్రజాప్రతినిధులకు బిఆర్ ఎస్ పార్టీ నాయకులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగా జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు రాఖీలు కట్టిన బిఆర్ ఎస్ పార్టీ మహిళా నేతలకు
చీరలు బ్లౌజులు బహుమతులుగా అందజేసి వారికి రాఖీ పౌర్ణమి శుభసందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు,
ఈ సందర్భంగా ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ మండలంలోని సబండ వర్గాల ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు వివిధ పార్టీల నాయకులకు అధికారులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు ,
అన్నా చెల్లెళ్లు అక్క తమ్ముళ్ల మధ్య గల అనుబంధానికి తరతరాలుగా రక్షాబంధన్ పర్వదినం నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు,
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ వారు ధన్యవాదాలు తెలిపారు,
ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణ హారి , సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుసాని మోహన్ కుమార్ యాదవ్, ఉపాధ్యక్షులు బందారపు బాల్ రెడ్డి, పాలకవర్గం సభ్యులు, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు కొండాపురం బాల్ రెడ్డి , మండల కోఆప్షన్ సభ్యులు జబ్బర్ , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , బిఆర్ ఎస్ పార్టీ నాయకులు మెగి నర్సయ్య, నమిలికొండ శ్రీనివాస్, మీసం రాజం, వట్టెల ప్రభాకర్ యాదవ్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు ,

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *