కంటి వెలుగు ప్రారంభించిన మహిళ ప్రజాప్రతినిధులు దౌల్తాబాద్ మండల పరిధిలోని దీపాయంపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక సర్పంచ్ దేవుడి లావణ్య నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దౌల్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మి పోచయ్య , స్థానిక జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు . తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు . ప్రభుత్వం ఉచితంగా వైద్య పరీక్షలు చేయించి అవసరం ఉన్నవారికి కంటి అద్దాలు మందులను అవసరమైతే ఆపరేషన్ కూడా ప్రభుత్వమే చేసిందని వారు తెలిపారు . ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగరాజు ,సూపర్వైజర్ శ్రీనివాస్, సిబ్బంది కర్ణ ,గీత, భవాని ,మమత,
ఆశ వర్కర్లు పాల్గొన్నారు.




