6 గ్యారంటీలను గడపగడపకు తీసుకెళుతున్న కాంగ్రెస్.
ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్29 మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముస్తాబాద్ మండలంలోని మొరాయిపల్లి గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తోనే సమన్యాయం దక్కుతుందని అన్నారు. ఈబిఆర్ఎస్ 9 యేండ్ల పాలనలో దగా మోసాలు తప్ప చేసిందేమీ లేదు అన్నారు. అలాగే పుట్టబోయే పాపకు లక్ష యాబై వేలు అప్పుచేసి పెట్టిన ప్రభుత్వం దళిత సీఎంలేడు దళితులకు మూడెకరాల భూమిలేదు దళిత బంధు ఆరోగ్యశ్రీ లేదు. కేవలం బిఆర్ఎస్ కార్యకర్తలకు అందుతుంది అన్నారు. వరివద్దు ఉరిముద్దు అన్న ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం మనం ఉరి వేయాలి అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామన్నారు అలాగే పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తు వడ్లకు 5 వందల రూపాయల బోనస్ ఇస్తాము కౌలు రైతులకు 15వేలు వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయలు ఏటా ఇస్తాము అన్నారు. ప్రతి మహిళకు 25 వందల రూపాయలు మరియు 5వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ మరియు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని అన్నారు. అలాగే గృహ జ్యోతి పథకం ద్వారా 2 వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలము మరియు ఐదు లక్షల రూపాయల సహాయం చేస్తాము మరియు ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇస్తాము అన్నారు. నిరుద్యోగులకు ప్రత్యేక జాబ్ కాలెండర్ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. మరియు యువ వికాసం పథకం కింద ఐదు లక్షల వరకు విద్యా భరోసా కార్డు అలాగే ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. మరియు మెగా డీఎస్సీ కూడా నిర్వహిస్తాము అని అన్నారు. చేయూత పథకం ద్వారా వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు 4వేలు రూపాయల పింఛన్ అందిస్తామన్నారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కింద పది లక్షల రూపాయలు అందజేస్తాము అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండo రాజి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వంగమోహన్ రెడ్డి, మోర్రాయిపల్లే గ్రామశాఖ అధ్యక్షులు కుమార్ యాదవ్, మద్దికుంట గ్రామశాఖ అధ్యక్షులు దొనుకుల కొండయ్య, చీకోడు గ్రామశాఖ అధ్యక్షులు బుగ్గ రమేష్, ఎస్సీ సెల్ మండల శాఖ అధ్యక్షులు తలారి నర్సింలు, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, సీనియర్ నాయకులు ఉచ్చిడి బాల్ రెడ్డి, రాజేశం ఆకారం రాజేష్, బద్దిపడిగ మహేష్ రెడ్డి, హరీష్, రాజనర్సు, శంకర్, రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.




