దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో సోమవారం రోజు మన ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతున్నటువంటి పనులను పరిశీలించడం జరిగింది. అలాగే మేజర్ అండ్ మైనర్ రిపేర్ పనితో పాఠశాలలో ఉన్న మన ఊరు మనబడి కార్యక్రమం లో ఉన్న పనులు పూర్తవుతాయని సర్పంచ్ చెప్పడం జరిగింది దీనితో ఈ కార్యక్రమంలో పాఠశాలను చాలా అభివృద్ధి చెందుతున్నాయని అలాగే విద్యార్థులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బుడ్డస్వర్ణలతభాగ్యరాజ్, ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, హెచ్ఎం ఊర్మిళ, రాజశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




