సంతోషిమాత సేవా పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం
సిద్ధిపేట జిల్లా గజ్వేల్, నవంబర్ 16
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ సంతోషి సేవా పరిషత్తు ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమం ఆదివారం గజ్వేల్ ఆత్మ కమిటీ మాజీ అధ్యక్షులు ఉడెం కృష్ణారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేశపతి రాజశేఖర శర్మ మాట్లాడుతూ కార్తీక మాసంలో వనభోజనం శ్రేష్టమని, సంతోషి సేవా పరిషత్ ఆధ్వర్యంలో కార్తిక వనభోజనం మహోత్సవం వైభవంగా నిర్వహించడం జరిగిందని, గోపూజ విఘ్నేశ్వర పూజ తులసీదాత్రి నారాయణస్వామి కళ్యాణము అనంతరము మంగళ హారతుల సేవ సంగీత సేవ ఆటలు పాటలు అనంతరం వనభోజనాలు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి దేవదేవుల అనుగ్రహం ఉంటుందని అన్నారు, ఈ కార్యక్రమంలో సంతోషి సేవా పరిషత్ సభ్యులు ఆర్యవైశ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు





