యాదాద్రి భువనగిరి జిల్లా కాచరం రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను సోమవారం గజ్వేల్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ కోశాధికారి నేతి శ్రీనివాస్ గుప్త కు అధ్యాత్మిక ధార్మిక జాతీయ అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి అందజేశారు. ఈ సందర్భంగా నేతి శ్రీనివాస్ మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఒక పవిత్ర ప్రదేశం అని దశాబ్దాలుగా ప్రజల ఇలవేల్పు గా ప్రసిద్ది చెందిన రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు వంగపల్లి అంజయ్య స్వామి అభినందనీయులు అని అన్నారు. వంగపల్లి అంజయ్య స్వామి ఇటీవల తమిళనాడు లో డాక్టరేట్ స్వీకరించిన సందర్భంగా వారిని అభినందించారు