ప్రాంతీయం

ఎంపీ కేపీఆర్ గారి సహకారంతో బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి

129 Views

తొగుట: మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో బాదిత కుటుంబాలకు అండగా ఉంటామని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. వెంకటరావుపేటలో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త వడ్డె రాములు కుటుంబాన్ని మండల ఎంపీటీసీ పోరం అధ్యక్షులు కంకణాల నరసింహులు తో కలిసి పరామర్శించి రూ.4వేల ఆర్థిక సహాయం అందించారు .రాములు అకాల మరణం తీరని లోటని వారు పేర్కొన్నారు..రైతు భీమా ద్వారా రాములు కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం త్వరలోనే అందుతుందని తెలిపారు.. రైతుబంధు రైతు బీమా పథకాలు రైతులకు భరోసా ఇస్తున్నాయని వారు తెలిపారు.. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పులిగారి శివయ్య మార్కెట్ డైరెక్టర్ ఈదుగల పరశురాములు, నాయకులు పాతుక్కుల బాలయ్య , తడ్గం నర్సింహారెడ్డి, బెజ్జనమైన శ్రీనివాస్, ఎర్రోళ్ల చంద్రం, సుతారి రాంబాబు, కల్లెపు నరేష్, గణేష్, స్వామి, యాదగిరి తదితరులు ఉన్నారు..

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7