నిజాయితీ చాటుకున్న జర్నలిస్ట్ గుడాల శేఖర్ గుప్త అభినందనీయుడు అని లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అద్యక్షులు సయ్యద్ మతీన్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మక్త గ్రామానికి చెందిన కాసాల స్వామి గౌడ్ స్మార్ట్ ఫోన్ పోగొట్టుకున్నాడు కాగా ఆ ఫోన్ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అద్యక్షులు సయ్యద్ మతీన్ చేతుల మీదుగా ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సయ్యద్ మతీన్ మాట్లాడుతూ స్వామి గౌడ్ ఫోన్ మా లయన్స్ క్లబ్ సభ్యులు జర్నలిస్ట్ గుడాల శేఖర్ గుప్త కు లభించగా అది స్వామి గౌడ్ కు అందజేయడం జరిగింది అని నిజాయితీ చాటుకున్న శేఖర్ గుప్త కు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు ఇంద్ర గౌడ్, రవి గౌడ్, అజ్గార్,రమేష్,ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు




