Breaking News

అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత

34 Views

రామగుండం పోలీస్ కమిషనరేట్

అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత

పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.,

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ లో ఎఎస్ఐ గా విధులు నిర్వహిస్తూ ఎం. వెంకట్ రెడ్డి, ఎఎస్ఐ-70  అనారోగ్యంతో మరణించగా ఆయన భార్య శ్రీలత కి భద్రత ఎక్స్గ్రేషియా 8,00,000/- రూపాయల చెక్ ను ఈ రోజు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా  తన కార్యాలయం లో వారికి అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా మరణించి ఎ ఎస్ ఐ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను సీపీ గారు అడిగి తెలుసుకోవడంతో పాటు, వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసేవిదంగా చూస్తామని తెలియజేశారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం తో పాటు వారి కుటుంబాలకి అండగా ఉంటామని సీపీ అన్నారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, ఏఓ శ్రీనివాస్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *