దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని తోగుట మండలం బండారుపల్లి గ్రామంలో లోక కల్యాణ ఆశ్రమంలో గురూజీ గంధం సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో మహా మృత్యుంజయ హోమ యజ్ఞంను అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఇందులో సుమారు 30దంపతులు పాల్గొన్నారు.అనంతరం అన్న ప్రసాదంను ఏర్పాటు చేశారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.భజన కార్యక్రమాలు నిర్వహించారు.తదుపరి అధ్యాత్మిక స్వాములకు పలువురికి సన్మానం చేశారు.మహా మృత్యుంజయ హోమ యజ్ఞం చేయడం వలన ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడు జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో ఈ యజ్ఞన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఓంకార శబ్దన్ని ఎల్లప్పుడూ జేపించాలని తెలిపారు.
