బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శ
రాష్ట్ర మాజీ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 15
కుకునూర్ పల్లి : మండలంలోని పిటి వెంకటపూర్ గ్రామానికి చెందిన పేర్క కల్పన స్వామి మాజీ సర్పంచ్ వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్ద కుమారుడు పృద్విక్ ( 7 ) గ తేడాది డిసెంబర్ లో చలి మంటలు కాచుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు మంటలో పడి త్రివంగా గాయపడ్డాడు, అప్పటినుంచి బాలుడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం గాంధీ ఆసుపత్రిలో బాలుడు చికిత్స పొందుతుండగా ప్రాణాలు కోల్పోయాడు విషయం తెలియడంతో సోమవారం తెలంగాణ రాష్ట్ర మాజీ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆర్థిక సహాయం అందజేశారు. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు. ధైర్యంగా ఉండాలని చెబుతూ మనోధైర్యాన్ని కల్పించాలి.
ఈ కార్యక్రమంలో వారి వెంట జగదేవపూర్ మండల పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి. ఎంపీటీసీల పోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్. చిన్న కిష్టాపూర్ మాజీ సర్పంచ్ కనకయ్య.నాయకులు లక్ష్మణ్. రాజు,నరేష్.తదితరులు పాల్గొన్నారు.





