సిద్దిపేట జిల్లా రాయపొల్ మండల పరిధిలోని రాంసాగర్ ఎస్సీ కాలనీలో చిన్నారులు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉదయాన్నే లేచి కలపు చలి అందమైన ముగ్గులు వేసి గ్రామాన్ని పండుగ వాతావరణంతో నింపారు. ఇళ్ల ముందర రంగురంగుల ముగ్గులు వేస్తూ “హ్యాపీ పొంగల్” అంటూ సందేశాలు రాస్తూ పండుగ శోభను మరింత పెంచారు. ఈ సందర్భంగా మండల ప్రజలు గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. పిల్లల ఉత్సాహం, వారి కళాత్మక ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది. ఈ ముగ్గులు గ్రామానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.





