ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 4, జాతీయ సిమ్మింగ్ పోటీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామానికి చెందిన బండి నర్సింలు ఉత్తమ ప్రతిభ కనబరిచి మూడు పథకాలను కైవసం చేసుకున్నాడు. దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న బండి నరసింహులు హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న ఐదవ ఆల్ ఇండియా మాస్టర్ గేమ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో సిమ్మింగ్ బ్యాక్ స్ట్రోక్ 100 మీటర్ 50 మీటర్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రెండు సిల్వర్, ఒక రజతం పథకాన్ని సాధించారు. ఈనేపథ్యంలో సిమ్మింగ్ పోటీలో ప్రథమ స్థానంలో ఉన్నందున పలువురు అభినందించారు.
