ప్రాంతీయం

మహిళలు సాయం ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలి*

516 Views

-అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న సీఎం కేసీఆర్
* వివోఎలా ల జీతాలు పెంచుతాం
-మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్  సాధికారతే లక్ష్యం గా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాయపోల్ లో ని జీఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన మండల మహిళా స్వయం
సహాయక సంఘాల సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ కష్టమొచ్చినా అధిక వడ్డీలకు రుణాలు తెచ్చుకునేవారాని , వాటిని తీర్చడానికి అష్ట కష్టాలు మహిళలు పడేవారన్నారు. గతంలో స్వయం సహాయక సంఘాలకు రూ.5 లక్షల రుణం ఇచ్చేవారని నేడు సీఎం కేసీఆర్ ఆదేశాలతో 20 లక్షల వరకు రుణాలు అందిస్తున్నారన్నారు.మహిళలు స్వయం సమృద్ధి సాధించడానికి మరింత సహకారాన్ని అందిస్తామన్నారు.నిన్న సిద్దిపేట లో కోమటి చెరువు వద్దకు వెళ్ళానని, అక్కడ మహిళలు స్టాల్స్ ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. వివోఏ లకు సాలరీ తక్కువ ఉందని గతంలో జరిగిన సమావేశాల్లో తన దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు.ఈ విషయాన్ని మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావుతో కలిసి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.మా విజ్ఞప్తి కి సీఎం కేసీఆర్ స్పందించి వారి సాలరీ పెంచుతామని హామీ ఇచ్చారన్నారు.వడ్డీ లేని రుణాలకు కూడా త్వరలో విడుదల చేస్తామన్నారు. మహిళా సంఘాల మహిళలకు బీమా సౌకర్యం కూడా కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు.అంగన్వాడీ, ఆశా వర్కర్ ల మాదిరిగా డ్రెస్ కోడ్ ఉండాలని అడగగా వివో ఏ లు కు, సీసీ లు అడిగారని అడగగా వారికి నేను డ్రెస్ లు సమకూర్చుతామన్నారు.తెలంగాణ తరహా..అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేవని, ఎవరు పని చేస్తున్నారో వారిని గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మనోహర్ రావు, ఎంపీపీ కల్లూరి అనిత, జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ పర్వేజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి, గ్రామ సర్పంచ్ మౌనిక రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తుడుం లక్ష్మి, గ్రామ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, రాష్ట్ర యువజన నాయకులు రాజిరెడ్డి, కల్లూరి శ్రీనివాస్, ఎంపీడీవో మున్నయ్య, ఏపీఎం దుర్గాప్రసాద్, సీసీలు కిష్టయ్య, రవీందర్, నాగరాజు, ప్రవీణ్, రోజా వివోఏలు వినోద, సుభద్ర, లక్ష్మి, లావణ్య, రేణుక, మల్లేశం, నర్సింలు, కోటేష్, స్వామి, నరేందర్ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఉషనగల్ల నర్సింలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *