దౌల్తాబాద్: దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే మాధవ నేని రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కోనాయిపల్లి, దీపాయంపల్లి, గొడుగుపల్లి, లింగాయపల్లి తాండ, అప్పాయి పల్లి, సూరంపల్లి, లింగరాజు పల్లి, ముత్యంపేట, గ్రామాల్లో హైమాక్స్ లైట్ల ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచేందుకు అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఆయా గ్రామాల్లో పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కొత్త సురేందర్ రెడ్డి, లావణ్య నర్సింహారెడ్డి, శివకుమార్, దేవి యాదగిరి, సుగుణ యాదగిరి, కేత కనకరాజు, బండి రాజు తో పాటు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు…




