ప్రాంతీయం

బాంబు పేలుళ్ల‌ నేపథ్యంలో అల‌ర్ట్ – కమిషనర్

30 Views

బాంబు పేలుళ్ల‌ నేపథ్యంలో అల‌ర్ట్ – రామగుండం పోలీస్ కమీషనరేట్.

కమీషనరేట్ పరిధిలో బాంబు స్క్వాడ్, జాగిలాలతో విస్తృత తనిఖీలు.

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ రోజు పరిధిలోని గోదావరిఖని, రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, లక్షేట్టిపేట, అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల నేతృత్వంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రద్దీగా ఉండే ప్రాంతాలలో పోలీసులు బాంబు స్క్వాడ్, జాగిలాలతో తనిఖీలు నాకబంది నిర్వహించి వాహనాల తనిఖీలు చేపట్టారు. జనసంచారం ఎక్కువగా ఉండే ఏరియాలలో పోలీసులు అడుగడుగునా సోదలు జరిపారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, అదేవిధంగా ప్రధాన చౌరస్తా లతో పాటు వివిధ ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అదేవిధంగా నిత్యం రద్దీగా ఉండే దుకాణ సముదాయాల ప్రాంతాల్లో నిలిచి ఉన్న వాహనాలను బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అనుమానం వచ్చిన వస్తువులను జాగిలాలతో సోదాలు చేశారు.

ఈ తనిఖీ లలో డీసీపీ, ఏసీపీ లు, ఇన్స్పెక్టర్ లు, ఎస్ఐ లు బాంబు స్క్వాడ్, జాగిలాల బృందం పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *