ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 13, ఉష్ణోగ్రతలు క్రమ క్రమంగా తగ్గుముఖానికి చేరే దిశలో అధిక ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండడంణపట్ల వాతావరణంలో ఎలాంటి మార్పులు లేకుండా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈసందర్భంగా విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడు మాట్లాడుతూ విద్యాసంస్థలకు ఓ
వారం రోజులు సెలవులను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్, మండల అధ్యక్షుడు మట్ట నరేష్, పట్టణ అధ్యక్షుడు రుద్రవేణి సుజిత్, మరియు నాయకులు పోతారం వంశీ, అల్లే నీరజ్ తదితరులు పాల్గొన్నారు.




