మహిళా సంఘ సభ్యులకు బ్యాంకు రుణాలు అందరికీ అందించాలి
మహిళా సంఘ సభ్యులకు బ్యాంకు రుణాలు అందరికీ అందించాలి డి ఆర్ డి ఏ పి డి గోపాల్ రావు సెర్ప్ సిబ్బందితో సమీక్ష సమావేశం దౌల్తాబాద్ మండల మహిళా సమైక్య కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి మహిళకు బ్యాంకు మరియు శ్రీనిధి ద్వారా లోన్ కల్పించాలన్నారు. మహిళా సంఘాలు చిన్న సంఘాలు ప్రతినెల సమావేశంలో నిర్వహించుకొని లావాదేవీ జరుపుకోవాలని సూచించారు. ప్రతి మహిళా సంఘం సభ్యురాలికి లోన్ అందించే విధంగా సీసీలు చూసుకోవలసిన బాధ్యత ఉందన్నారు. 18 సంవత్సరాల పైబడిన విద్యార్థిని విద్యార్థులు చదువుకొని ఖాళీగా ఉండే వారికి ఎల్ అండ్ డి ఆధ్వర్యంలో వారికి ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తామన్నారు. ప్రతి గ్రామం నుంచి ఒకరు తప్పకుండా ఒకరిని పంపించాలని వివోఏలకు సూచించారు. మహిళలు అభివృద్ధి చెందాలంటే బ్యాంకు ద్వారా రుణాలు తీసుకొని సక్రమంగా చెల్లించి చిరు వ్యాపారాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం దుర్గాప్రసాద్ సిసిలు వివోఏలు పాల్గొన్నారు.




