ప్రాంతీయం

నీటి పొదుపే రేపటి తరానీకి జీవనదారం..

102 Views

నీటి పొదుపే రేపటి తరానీకి జీవనదారం..

-గుగ్గిళ్ళలో బాలవికాస ఆధ్వర్యంలో ప్రపంచంనీటి దినోత్సవ అవగాహన సదస్సు 

సిద్దిపేట జిల్లా, బెజ్జంకి మార్చి 18, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామంలో బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవాన్నీ పురస్కరించుకొని ముందస్తుగా గుగ్గిళ్ళ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ప్రాథమిక పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నీటి ప్రాముఖ్యతపై నినాధాలు చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుగ్గిళ్ల గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, ఉపసర్పంచ్ దుగ్యానీ లావణ్య, వార్డు సభ్యులు హాజరై ప్రపంచ నీటి దినోత్సవం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నేడు మనం పొదుపు చేసే ప్రతి నీటి చుక్క రేపటి తరానికి జీవనాధారమని,జలాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలకు కన్నీరే మిగులుతుందని స్పష్టం చేశారు.అనంతరం గ్రామ కూడలిలో మానవహారంగా ఏర్పడి నీటి సంరక్షణ పై ప్రజలకు అవగాహన కల్పించారు.బాలవికాస సంస్థ ప్రతినిధులు సుజాత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని, జలమే మూలమని బాలవికాస సంస్థ కోఆర్డినేటర్లు సుజాత వివరిస్తూ జలం లేనిదే,జీవనం లేదని,ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ,పొలాల్లో పాము పాండు ఏర్పాటు చేసుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర జల సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షపు నీటిని పొడిసి పట్టుకోవడం ద్వారానే భూగర్భ జలాలను కాపాడుకోగలుగుతామని తెలిపారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానం చేశారు.ఈ యొక్క వ్యాసరచన పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పిహెచ్ఎస్ పాఠశాల హెడ్మాస్టర్ మమతా గౌతమి, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్,సుజాత, ఉపాధ్యాయులు,గ్రామ ప్రజలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *