.తల్లి పాల ప్రాముఖ్యత:ఆగస్ట్
వరకు బంగ్లా వేంకట పూర్ ఊరు గజ్వేల్ మండలం సిద్ది పేట జిల్లా లో జరిపించారు ఈ కార్య క్రమాన్ని ఆ ఊరు గ్రామ సర్పంచ్ బాపు రెడ్డి మరియు ఆశా వర్కర్ లు కమల కస్తూరి మేడం ఐనా ఏ ఏన్ ఏం.ఏమ్ ఎల్ ఎచ్ పి రాని అక్కడి అంగన్ వాడి టీచర్ వనజ మేడం మరియు ఆ అంగన్ వాడి ఆయమ్మ వెంకటమ్మ వంటి వారు జరిపిస్తు గుర్తు చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా తల్లు లఅందరికీ బ్రెస్ట్ ఫీడింగ్ మీద అవగాహన వారం అంటే ఆగస్ట్ 1 నుంచి 7 వరకు 120 పైగా దేశాల్లో బ్రెస్ట్ ఫీడింగ్ వారంగా జరిపి, కాబోయే అమ్మలకి, కొత్తగా తల్లులైన వారికి అవగాహన కలిపిస్తున్నారు. ఏ బిడ్డకు అయినా తల్లే ఆధారం. కడుపులో ఉన్నప్పుడు, కడుపులో నుండి బయటపడినప్పుడు కూడా శిశువు అన్ని అవసరాలు తీర్చేది తల్లే. కడుపులో ఉన్నప్పుడు బిడ్డ శరీర అవయవాలు ఒక విధంగా అభివృద్ధి చెందితే, బిడ్డ పుట్టిన తరువాత శరీర అవయవాల అభివృద్ధి మూడు నెలల్లో రెట్టింపుగా పెరుగుతాయి. కారణం ఒక్కటే. తల్లిపాలు.
ఎన్నో విశేషాలు ఉన్న తల్లిపాలను భారతదేశంలో కేవలం 37 శాతం మంది పిల్లలే ఆరునెలల వరకు తాగుతున్నారు అంటే పిల్లలకి ఎంత తక్కువ పాళ్ళల్లో తల్లి పాలు అందిస్తున్నారో అర్ధం అవుతోంది. దీని కారణం తల్లిపాల గొప్పతనం తెలియకపోవడం కావచ్చు, కొంతమంది వక్షోజాల అందం తగ్గుతుందనో, లేదా ఇచ్చే వెసులుబాటు లేకపోవడమో కానీ చాలామంది శిశువులకి తల్లిపాలు రుచి అందడం లేదు. నిజానికి చనుబాలు పిల్లలకు ప్రత్యేక ఔషధంగా పనిచేస్తాయి. తల్లిపాలను సరిగ్గా పిల్లలకి ఇవ్వగలిగితే ఏటా 8.23 లక్షల మంది పిల్లలను ఐదేళ్లలోపు మరణించకుండా కాపాడుకోవచ్చు. పిల్లలకు చనుబాలు ఇవ్వకపోవడం వల్ల, రొమ్ము కేన్సర్లతో మరణిస్తున్న మహిళల సంఖ్య 20 వేల వరకు ఉంది అంటే ఈ సమస్య ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రత్యేకతలు
తల్లిపాలలో బిడ్డ ఎదుగుదలకు అవసరమైన తేలిగ్గా జీర్ణమయ్యే పోషకాలు ఉంటాయి.
తల్లిపాలు బిడ్డ శారీరక అవసరాలకు తగినట్లుగా మారుతూ ఉంటాయి. కాన్పు అయిన మొదటిరోజు. నుంచి నాలుగు రోజుల వరకు ముర్రుపాల(కొలస్టమ్)ని అమృతతుల్యం అని చెప్పుకోవచ్చు. బిడ్డకు అవసరమైన తొలి పోషణ, రక్షణ లభించేది దీని నుంచే. 5-14 రోజుల వరకు వచ్చే తల్లిపాలు వేగంగా పెరిగే బిడ్డ శరీర అవసరాలకు తగినట్టుగా ఉండి బిడ్డకు గొప్ప శక్తిని అందిస్తాయి. ఈ పాలల్లో లాక్టోజ్, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. రెండు వారాలు తర్వాత పాలు మామూలు దశకు చేరుతాయి. ఇందులో 90 శాతం నీరు, పిండిపదార్థాలు, విటమిన్లు 2 శాతం, ప్రొటీన్లు, కొవ్వులు 8 శాతం, ఉండి బిడ్డ సంపూర్ణ ఎదుగుదలకు సాయం చేస్తాయి. మామూలు కాన్పు అయినా, సిజేరియన్ అయినా సరే వీలైనంత త్వరగా బిడ్డకు తల్లిపాలను ఇవ్వడం ప్రారంభించాలి.
ఎక్కువకాలం తల్లిపాలు తాగిన పిల్లల్లో ఇన్ఫెక్షన్లు, మరణాల ముప్పు తక్కువగా ఉండడంతో పాటు, ఆ పిల్లల్లో తెలివితేటలు అధికంగా ఉంటాయి.
ఎక్కువ కాలం తల్లిపాలు తాగిన పిల్లలకి భవిష్యత్తులో మధుమేహం, అధిక బరువు, కేన్సర్ వంటి ముప్పులు తక్కువగా ఉంటాయి.
తల్లిపాలల్లో ‘హ్యూమన్ ఓలిగోసా క్రెడ్లు’ ఉండే ఒక రకమైన చక్కెరలు పేగుల్లోని చెడు బాక్టీరియాను తగ్గించి, మంచి బాక్టీరియాను తయారు చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
తల్లిపాల వల్ల రోగనిరోధక శక్తి అభివృద్ధి చెంది పిల్లలు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు.
పిల్లలకు ఆరు నెలలు నిండేంత వరకు తల్లిపాలు తప్ప మరే ఆహారం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆరునెలల తర్వాత బిడ్డకు తల్లిపాలు ఇస్తూనే ఘనాహారం ఇవ్వడం ప్రారంభించాలి. ఇలా తల్లిపాలను పిల్లలు రెండు సంవత్సరాలు నిండే వరకూ కొనసాగించాలి.
పసి పిల్లలు ఆకలి వేసినప్పుడే కాదు, దాహం వేసినా, తల్లి స్పర్శ కావాలన్నా తల్లిపాల కోసం. వెతుక్కుంటారు.
తల్లిపాలు చాలా సురక్షితం అందువల్ల పిల్లలకి ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావు. పోతపాలతో చాలా
చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సీసాలను సరిగా శుభ్రం చేయకపోయినా, కలిపి ఉంచిన పాలను
శిశువుకు తాగించినా విరోచనాలు అవుతాయి. ఇవేకాకుండా ఊపిరితిత్తుల్లో నెమ్ము, గొంతునొప్పి,
పిప్పిపళ్లు వంటి రకరకాల సమస్యలు తలెత్తుతాయి.
తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లలకి అలర్జీలు, అస్థమా ముప్పు తగ్గుతుంది. ఆరు నెలల వరకూ పూర్తిగా తల్లిపాల మీద ఆధారపడే పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు, విరేచనాల సమస్యలు, శ్వాసకోశ జబ్బులు, వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
తల్లిపాలు తాగిన పిల్లలకు ఐక్యూ (తెలివి తేటలు) ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇవే కాకుండా తల్లి పాలు తాగడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లలు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు అని వైద్యులు చెప్తున్నారు.
