ఇక్కడ బీడు భూములకు గోదావరి జలాలు పారించి సస్యశ్యామలం చేస్తామని ఆనాడు మాట ఇచ్చిన సీఎం కేసీఆర్ నేడు ప్రాజెక్టులు నిర్మించి మాట నిలుపుకున్నాడని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.. గజ్వెల్ నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్దీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి లతో కలిసి కొడకండ్ల వద్ద మల్లన్నసాగర్ జలాలను కూడవెళ్లి వాగులోకి, వర్గల్ వద్ద కొండపోచమ్మ సాగర్ జలాలను హల్ది వాగు లోకి ఎంపీ విడుదల చేశారు..ఈసందర్భంగా గంగమ్మ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు…. ఈసందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కూడవెల్లి, హల్దివాగు పరివాహ ప్రాంతాల పరిధిలో నేడు పెద్ద ఎత్తున పంట పొలాలు సాగు చేయడం జరిగిందన్నారు..నేడు వాగుల్లో పంట పొలాలు ఎండిపోయే అవకాశం ఉండటంతో రైతుల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్ రావుల ఆదేశాల మేరకు నేడు నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు..నీటి విడుదల మూలంగా..వేలాది ఎకరాల పంట పొలాలకు మేలు జరుగుతుందన్నారు…నాడు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే తమకు ఉనికి ఉండదని చెప్పరాని కుట్రలు చేయడం జరిగిందన్నారు.కింది కోర్టు నుండి మొదలు కొని సుప్రీంకోర్టు వరకు కేసులు వేశారన్నారు. నేడు ప్రాజెక్టుల నిర్మాణంతోనే నీటిని విడుదల చేసుకుంటున్నామని ఆయన తెలిపారు.తెలంగాణ వొచ్చిన తర్వాతే రైతులు , సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నారన్నారు.నీటిని విడుదల చేసి వేలాది రైతులకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావులకు జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. .తెలంగాణ మోడల్ గా దేశమంతా అభివృద్ధి, సంక్షేమం కావాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందన్నారు..బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుందన్నారు..ఆధాని అవినీతిపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలను ఏకం చేసి.. పోరాటం సాగిస్తామన్నారు..lic ని కార్పొరేట్ కోరల్లో నుండి రక్షించడానికి పోరాటం చేస్తామన్నారు..సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యం గా ముందుకు సాగుతామన్నారు..ఈసందర్భంగా తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి నాగలితో ఎంపీ గారిని సన్మానించారు..




