బహుజన్ సమాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ పై అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని బిఎస్పి దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జీ అనాజీపూర్ సంజీవు అన్నారు. ఒకవేళ క్షమాపణలు చెప్పని పక్షంలో ఎక్కడ కనిపించిన అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. అధికార పార్టీ నేతల దగ్గర చెమ్చాగిరి చేస్తూ ప్రభుత్వం విసిరిన ఎంగిలి మెతుకులకు అలవాటు పడి ఒక ఉన్నత స్థాయి నాయకుడిని దుర్భాషలాడటం మంచి పద్దతి కాదని హెచ్చరించారు.
