ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు వెంటనే క్షమాపణ చెప్పాలి
– దుబ్బాక నియోజకవర్గం బిఎస్పి పార్టీ ఇంచార్జ్ సంజీవ్
బహుజన సమాజ్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ అనాజిపూర్ సంజీవ్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ బేసరత్తుగా క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో గువ్వల బాలరాజు | తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎక్కడ తిరుగనివ్వకుండా అడ్డుకుంటామని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం విసిరిన ఎంగిలి మెతుకులకు అలవాటు పడి దుర్భాషలాడటం మంచి పద్ధతి కాదని దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జ్ సంజీవ్ హెచ్చరించారు.