

<img src="https://tslocalvibe.com/wp-content/uploads/2023/01/IMG-20230101-WA0010-300×225.jpg" alt="" width="300" height="225" class="alignnone size-medium wp-image-5761" /
చర్చి అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నానని చర్చితో 15 ఏళ్ల అనుబంధం తనకు ఉందని కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు బాగుండాలని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, ట్రస్ట్ చైర్మన్ మద్దుల నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వెంకటరావుపేట గ్రామంలో నూతన సంవత్సర వేడుకలో భాగంగా చర్చిలో జరిగిన ఉత్సవాల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటరావుపేట గ్రామంలో చర్చితో తనకు కొన్నిఏళ్ల అనుబంధం ఉందా అని చర్చ అభివృద్ధి చేస్తూ వస్తుందని చెప్పారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు బాగుండాలని అనుకున్న పనులు సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. కుల మతాలకతీతంగా అందరు సమానమేనని సామాజిక కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీలాదేవి వెంకటేశం మరియు పాస్టర్లు పాల్గొన్నారు.




