కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 3 వ వార్డ్ ప్రజలకు అందుబాటులో కంటి వెలుగు కార్యక్రమాన్ని వార్డ్ కౌన్సిలర్ మర్కంటి వరలక్ష్మి కనకయ్య అధ్యక్షతన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణా రెడ్డి తో కలిసి ప్రారంభించిన ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మానస పుత్రిక కంటి వెలుగు ఒక బృహత్తర కార్యక్రమం అని నిరుపేదల ముఖాల్లో సంతోషం కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా సీఎం కెసిఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశంలో విప్లవాత్మక మార్పు రావడం ఖాయమని అన్నారు ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ జఖీవుద్దీన్, మున్సిపల్ కమీషనర్ విద్యాధర్,కౌన్సిలర్స్, ఆత్మ కమిటీ డైరెక్టర్ ఎలా వెంకటేష్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, నాయకులు బిఆర్ఎస్ నాయకులు అహ్మద్, శ్రీరామ్ మల్లేష్, కనకయ్య,షరీఫ్, ఎల్లేష్, తదితరులు పాల్గొన్నారు




