కామారెడ్డి జనవరి 16 :ప్రజల ఆరోగ్యాలను కాపాడడానికి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న ఒక రైతు పంట చేనును పలువురు ప్రజా ప్రతినిధులు, రైతులు పరిశీలించారు.
కామారెడ్డి జిల్లా, సదాశివ నగర్ మండలం కుప్రియాల్ గ్రామానికి చెందిన సురుకంటి మైపాల్ రెడ్డి అనే రైతు తనకున్న వ్యవసాయ క్షేత్రంలో సేంద్రీయ పద్ధతిలో చెరుకు పంటను సాగు చేసి స్వయంగా బెల్లం తయారు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా చెరుకు పంటనే కాకుండా కూరగాయలు, వరిని కూడా పండిస్తానని ఆయన పేర్కొన్నారు. చెరుకు పంట సాగు వల్ల ఎకరానికి 40 క్వింటాళ్ల బెల్లం దిగుబడి వస్తుందని క్వింటాల్కు11000 రూపాయల చొప్పున విక్రయిస్తానన్నారు. చాలామంది ప్రజలు కిలోకు 110 రూపాయలు చెల్లించి బెల్లం తీసుకెళ్తారని ఆయన వివరించారు. తాను గత ఎనిమిదేళ్లుగా సేంద్రియ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నానని తనతో పాటు చాలామంది ఆరోగ్యాలు కాపాడడానికి కృషి చేస్తున్నానన్నారు. ఇంకా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించాలని మహిపాల్ రెడ్డి కోరారు. షుగర్ వ్యాధి ఉన్న వ్యక్తులు పెద్ద ఎత్తున బెల్లం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డిని పలువురు నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సింగిల్ విండో చైర్మన్ మర్రి సదాశివరెడ్డి, సదాశివనగర్ మండల మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు, పైడి సంతోష్ రెడ్డి, చెట్కూరి ఆనంద్ రెడ్డి తోపాటు పలువురు రైతులు పాల్గొన్నారు.