వ్యవసాయం

వర్గల్ మండల్ షేర్ పల్లి గ్రామంలో రైతు శిక్షణ కార్యక్రమం.

214 Views

రైతు శిక్షణ కార్యక్రమం. రైతు శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కంట్రోల్ ఐపీఎం సెంటర్ సమగ్ర సస్యరక్షణ కేంద్రం నుండి షేర్ పల్లి గ్రామం, వర్గల్ మండల్, సిద్దిపేట జిల్లాలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీమతి సునీత సమగ్ర సస్యరక్షణ అధికారి ఈ కార్యక్రమంలో పి పి ఎం కిడ్స్ మరియు లింగాకర్షణ బుట్టలు ఎంపిక చేసిన కొంతమంది రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీత మాట్లాడుతూ సమగ్ర సస్యరక్షణ పద్ధతులను కూరగాయ పంటలతో ఎలా పండించాలో వివరంగా తెలియజేశారు. విత్తన శుద్ధి ఐపీఎం కిడ్స్ తాలూకా ప్రాముఖ్యత వివరంగా తెలియజేశారు. పంటలలో విచక్షణారహితముగా పురుగుమందులు వాడకూడదని దానికి బదులుగా వేప నూనె, వేప కషాయం విరమణ ట్రాప్స్ తదితరమైన వాటిని వాడటం ద్వారా పురుగులను నివారించవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎం. నీలారాని సహాయ సమగ్ర సస్యరక్షణ అధికారి, ఎస్. శేష శయన మండల వ్యవసాయ అధికారి, ఆర్ భారతి వ్యవసాయ విస్తరణ అధికారి, సర్పంచ్ డి నారాయణ మరియు రైతులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *