జగదేవపూర్ గ్రామానికి చెందిన ముదిరాజు సంఘం మండల అధ్యక్షులు రాగుల రాజు ముదిరాజ్ కు ఇటీవల బీసీ రత్న రాష్ట్ర అవార్డు రావడం జరిగింది విషయం తెలుసుకున్న జగదేవపూర్ మండలంలోని 1989 ఎస్ఎస్సి బ్యాచ్ కి చెందిన స్నేహితుల బృందం బుధవారం ఎల్లమ్మ దేవాలయం ఎదుట రాష్ట్ర అవార్డు గ్రహీత రాగుల రాజు ముదిరాజ్ కు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి అవకాశాలు మరిన్ని అందుపుచ్చుకోవాలని భవిష్యత్తులో బీసీలకు రాజకీయ అవకాశాలు వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో శంకర్ గౌడ్ సత్యనారాయణ బాల్ చారి సిద్దయ్య వెంకటస్వామి జానీ గణేష్ చంద్రయ్య పెంటయ్య రాజిరెడ్డి కృష్ణమూర్తి దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు.