దౌల్తాబాద్: మండల వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి మండలంలో పురాతన ఇండ్లు దెబ్బతిన్నాయి. మండల పరిధిలోని దీపాయంపల్లి లో ఐదు, కోనాపూర్ లో ఒకటి, మహమ్మద్ షాపూర్ లో ఒకటి, దొమ్మాటలో రెండు, సూరంపల్లి లో ఒక ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తహాసిల్దార్ సుజాత తెలిపారు. ఆ సమయంలో ఇళ్లల్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి ఇబ్బందులు ఉన్న అధికారులకు తెలపాలని ఆమె సూచించారు.
