దౌల్తాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులలో భాషా పండితులకు, పిఈటిలకు అవకాశం ఇవ్వనందున రాష్ట్ర పండిత జెఎసి పిలుపుమేరకు బుధవారం మండల పరిధిలోని ముబారస్ పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భాషా పండితులు పర్షరాములు, జరినా సుల్తానా లు ప్రధానోపాధ్యాయునికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 22 సంవత్సరాలుగా ఎలాంటి ప్రమోషన్లకు నోచుకోలేదని విద్యా హక్కు చట్టం ప్రకారం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే ఉండాలి కానీ భాషా పండితుల విషయంలో అధికారులు వివక్షత చూపుతున్నారన్నారు. ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా బోధన చేస్తూ పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న పండితులకు న్యాయం జరగలేదన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పండితుల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారన్నారు. పదోన్నతుల్లో భాషా పండితులకు అవకాశం కల్పించకపోతే రాష్ట్ర పండిత, పిఈటి జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు 9,10 వ తరగతి లకు పాఠాలు బోధించమని తెలిపారు..
