ప్రాంతీయం

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సర్పంచ్ అభ్యర్థి

428 Views

గ్రామ అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యం – తాడెం సత్యలక్ష్మి, గణేష్

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సర్పంచ్ అభ్యర్థి తాడెం సత్యలక్ష్మి

మర్కుక్, డిసెంబర్ 6,

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామ సర్పంచ్ బిజెపి అభ్యర్థిగా తాడెం సత్యలక్ష్మి, గణేష్ పోటీలో ఉన్నారు. శనివారం నాడు పాములపర్తి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి తాడెం సత్యలక్ష్మి, గణేష్, మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తు పై ఓటు వేయాలని, గ్రామ అభివృద్ధి కోసం మీ ముందుకు వచ్చానని, నిస్వార్ధంగా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యల పట్ల అనుభవం, పనిచేసే తత్వం, సమాజసేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇస్తే గ్రామానికి ప్రభుత్వం నుండి వచ్చే నిధులు గ్రామస్తుల సమక్షంలో చర్చించి ఏ పనులకు కేటాయించాలో నిర్ణయం తీసుకుంటానని గ్రామ ప్రజలకు తెలిపారు, గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. గ్రామస్తులు అందరూ ముఖ్యంగా యువత మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తు పై ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *