పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లి – గుండెపోటుతో మరణించిన శివయ్య గారి నవీన్ గుండెపోటుతో మరణించిన శివయ్య గారి నవీన్
గల్ఫ్ అధికారులతో మాట్లాడి రెండు రోజులు శ్రమించి మృతదేహాన్ని స్వగ్రామం ఎల్లారెడ్డిపేటకు పంపించే ప్రయత్నం చేసిన దుబాయ్ ఈ.టి.సి.ఏ అధ్యక్షులు రాధారపు సత్యం< గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ కమిటీ అధ్యక్షులు గుండెల్లి శ్రీనివాస్ కూడా మృతదేహం స్వగ్రామం రావడానికి కృషి చేశారుమృతదేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్న రాధారపు సత్యం తోటి మిత్రులుతల్లి తండ్రులకు ఒక్కగానొక్క కొడుకు నవీన్ ఉన్నారురాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపెట మండల కేంద్రానికి చెందిన శివయ్య గారి నవీన్ (26) గత సోమవారం దుబాయిలో గుండె పోటు తో మరణించాడు.గత సంవత్సరం క్రితమే వివాహమైంది. మృతుని భార్యను దుబాయ్ తీసుకెళ్ళారు, తల్లి తండ్రులకు ఒక్కగానొక్క కొడుకు నవీన్, నవీన్ మరణంతో తల్లి తండ్రులు కట్టుకున్న భార్య కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో తీవ్ర విషాద ఛాయలు అనుముకున్నాయి.నవీన్ పార్థివ దేహానికి ఎల్.ఎస్.ఎం.పి.కె చైర్మన్ మరియు ఎల్లారెడ్డిపేట వాస్తవ్యులు దుబాయ్ ఈ.టి.సి.ఏ అధ్యక్షులు రాదారపు సత్యం రోజులు శ్రమించి పార్థివ దేహాన్ని ఇంటికి పంపించడానికి అధికారులతో మాట్లాడి తీవ్రమైన కృషి చేశారు. నవీన్ మృతదేహాన్ని చూసి రాధారపు సత్యం మరియు తోటి మిత్రులు కంటతడి పెట్టుకున్నారు. పార్థివ దేహం ఎల్లారెడ్డిపేటకు రేపు రానున్నట్లు సమాచారం
