ప్రాంతీయం

దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కొత్త ప్రభాకర్ రెడ్డి తోనే సాధ్యం

149 Views

దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తోనే సాధ్యమని మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు పూజిత వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం లోని ప్రతి గ్రామ పంచాయతీకి జాతీయ ఉపాధి పథకం కింద ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహకారంతో జిల్లాను అగ్ర గామిగా నిలబెడుతున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సహకారంతో ప్రతి గ్రామపంచాయతీకి 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయం. ఏది ఏమైనా దుబ్బాక అభివృద్ధి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో సాధ్యమని ఇంత పెద్ద ఎత్తున దుబ్బాక నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి, జిల్లా ఆర్థిక శాఖ మంత్రి, దుబ్బాక నియోజకవర్గం ప్రజలందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *