గ్రామీణ ప్రాంతాల్లో యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి కబడ్డీ టోర్నమెంట్ – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి.
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం మరియు సంక్రాంతి పండగ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు లక్షట్టిపెట్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కబడ్డీ టోర్నమెంట్ ను బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వామి వివేకానంద స్ఫూర్తిగా తీసుకొని యువత అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వీరమళ్ళ హారి గోపాల్, బోప్పు కిషన్, రమేష్ చంద్, నరేష్ చంద్, వేముల మధు, సమరం, బిట్టు, పైడిపాల రమేష్, గంగన్న, పాంచాల రమేష్, వెంకట రమణ మరియు తతిదరులు పాల్గొన్నారు.
