సిరిసిల్ల అప్పుడెట్లుండే,,,, ఇప్పుడు ఎట్లుంది,,
సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి
రాష్ట్రంలోనే ముందువరుసలో ఉంది
జిఎస్టీ తో అన్ని రాష్ట్రాలను దోసుకుంటున్నది బిజెపి మోడీ ప్రభుత్వం కాదా
చురకలు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 01:
తెలంగాణ రాష్ట్రంలో నే అభివృద్ధి లో ముందు వరుసలో ఉన్న సిరిసిల్ల నియోజకవర్గం బిజెపి నాయకులకు కనబడటం లేదా అభివృద్ధి ప్రాధాత రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను విమర్శిస్తే బిజెపి నాయకుల్లారా నాలుక చీరేస్తా అని బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎఎంసి మాజీ చైర్మన్ అందె సుభాష్ హెచ్చరించారు,
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ జెడ్పిటిసి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందె సుభాష్ మాట్లాడుతూ జీఎస్టీతో అన్ని రాష్ట్రాలను దోసుకుంటుంది బిజెపి మోడీ ప్రభుత్వం కాదా అని ఆయన ప్రశ్నించారు
సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి అప్పుడెట్లుండే కెటిఆర్ హాయాంలో ఇప్పుడెట్లుంది బిజెపి పార్టీ నాయకులకు కనబడతలేదా వారు కళ్ళుండి చూడలేని కబోదులు అని ఆయన విమర్శించారు,
సిరిసిల్ల ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ యువతకు ఉపాధి అవకాశాల్లో భాగంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్, అపరెల్ పార్క్ , అగ్రికల్చర్ యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ , జే జే ఎన్ టి యు ఇంజనీరింగ్ కాలేజీ, నర్సింగ్ కళాశాల రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేశారని ఆయన గుర్తు చేశారు ,
నా ప్రజలు బాగుండాలి నా సిరిసిల్ల ప్రాంత ప్రజలు బాగుండాలని గౌరవ మంత్రి కేటీఆర్ కోరుకుంటున్నారన్నారు,
కేటీఆర్ గురించి బిజెపి నాయకులు మాట్లాడే భాష సరైన పద్ధతి కాదని సిరిసిల్ల ప్రాంత ప్రజలు దాన్ని గమనిస్తున్నారని బిజెపి పార్టీ నాయకుల్లారా ఖబర్దార్ కేటీఆర్ గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు,
కేసీఆర్ గారి గురించి గానీ కేటీఆర్ గారి గురించి గానీ బిజెపి నాయకులు మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని అభివృద్ధిని కాంక్షించే గొప్ప వ్యక్తి కేటీఆర్ కు క్షమాపణ చెప్పాలని లేకుంటే మిమ్మల్ని తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు,
బిజెపి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సిరిసిల్ల ప్రాంతానికి ఇప్పటివరకు చేసింది ఏమీ లేదని కనీసం ఒక నవోదయ స్కూల్ కూడా తీసుకురాలేని మూర్ఖుడని ఆయన విమర్శించారు
ఆయన సిరిసిల్ల ప్రాంతానికి ఓరగబెట్టింది ఏమీ లేదని, బిజెపి మోడీ ప్రభుత్వం కూడా ఓరగబెట్టింది ఏందో ప్రజలకు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్,
భారతదేశంలోనే కేటీఆర్ ఒక ఐకాన్ ఒక అంబాసిడర్ ఒక ఇంటర్నేషనల్ లీడర్ అని ఆయన అన్నారు,
కేటీఆర్ సిరిసిల్ల ప్రాంత ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాడని అన్నారు,
విలేకరుల సమావేశంలో ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, మండల కో ఆప్షన్ నెంబర్ జబ్బర్, మహిళా మండల అధ్యక్షురాలు అప్సరా, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , సీనియర్ నాయకులు నంది కిషన్,ఎలగందుల నర్సింలు మీసం రాజం, నరసయ్య, రమేష్ , వరద సతీశ్ తదితరులు ఉన్నారు
