ప్రాంతీయం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

14 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

పోలీస్ అధికారులు‌, సిబ్బందికి మరియు రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా , ఐపీఎస్.

ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ ల ప్రజలకు మరియు కార్యాలయ అధికారులకు, సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల కంటే తక్కువ సమయంలో అభివృద్ధి పథంలో నడుస్తోంది. సమాజంలో శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని తెలంగాణ అభివృద్ధిలో పోలీస్ శాఖ అన్ని స్థాయిలలో భాగస్వామ్యం అవుతూ శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క విషయంలో తెలంగాణ ముందంజలో ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో కష్టపడి పని చేసి ప్రజల సంక్షేమం పై దృష్టి పెట్టి పోలీస్ శాఖ తరపున సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ సేవలు అందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మహిళ భద్రత అనేది తెలంగాణ రాష్ట్రంలో మొదటి ప్రాధాన్యతలో ఉంది దానిలో భాగంగా షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు నిరంతరం శాంతిభద్రతలు కాపాడటంలో ఎంతో శ్రమించి ప్రజల రక్షణ కోసం శ్రమించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు లేకుండా తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యున్నత ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న పోలీస్ వ్యవస్థగా పేరు పొందినది అని తెలిపారు. మనం అమలు చేస్తున్న పద్ధతులను దేశంలోని ఇతర రాష్ట్రాల పోలీసులు వచ్చి పరిశీలించి వివరాలు తెలుసుకొని వెళ్లడం జరుగుతుంది. భరోసా సెంటర్ లు ఏర్పాటు చేసి బాధితులకి భరోసా, అండగా పోలీసులు ఉన్నారని నమ్మకం కల్పించడం, కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ ఏర్పడిన నుండి తెలంగాణ ప్రాంతంలో అసాంఘిక మావోయిస్టు మరియు టెర్రరిస్టు కదలికలు చర్యలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజల జీవన సాగించడం జరుగుతుంది. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఇన్ఫోర్స్మెంట్ వర్క్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలలో పోలీస్ పై ఒక మంచి భావన ఏర్పడింది. గంజాయి నిర్మూలనలో భాగంగా డ్రగ్ కంట్రోల్ టీమ్ లనీ ఏర్పాటు చేసి అక్రమ రవాణా, సరఫరా, సేవించడం పై పటిష్టమైన ఇన్ఫర్మేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది . గంజాయి రహిత ప్రాంతంగా మార్చాలని ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ కౌన్సెలింగ్లు నిర్వహిస్తూన్నాం. భవిష్యత్తులో పోలీస్ వారికి ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలని భవిష్యత్తు రాష్ట్ర అభివృద్ధిలో పోలీస్ శాఖ ప్రత్యేకమైన స్థానం ఉండాలని సీపీ ఆకాంక్షించారు.

2024 సంవత్సరంలో గ్రూప్-1 మరియు గ్రూప్-III సర్వీసుల పరీక్షల నిర్వహణలో సమర్ధవంతంగా నిర్వహించడానికి నిర్దేశించిన పరిపాలనా ప్రక్రియల అమలులో పోలీస్ నోడల్ అధికారిగా TGPSC పరీక్షలకు పోలీస్ వైపు నుండి మొత్తం ఇన్‌ఛార్జ్‌గా అధికారులకు మార్గనిర్దేశం చేసిన పనితీరు ,విధులను గుర్తించి TGPSC కమిషన్ ఛైర్మన్ ఇచ్చిన ప్రశంస పత్రం ను అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, ఏ ఆర్ ఏ సి పి ప్రతాప్ లకు , లకు సిపి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఎసిపి మల్లారెడ్డి, గోదావరిఖని రమేష్, ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్ ప్రతాప్, సురేందర్, ఏవో శ్రీనివాస్, సిఐలు ఇన్స్పెక్టర్లు ఆర్ఐ లు, సూపరిండెంట్ లు ఆర్ఎస్ ఎస్ఐ లు,ఎస్సైలు సిపిఓ సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది ఏఆర్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్