కోటి సంతకాల సేకరణ కార్యక్రమంబహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడం కోసం
బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు నీరాటీ భాను ఆధ్వర్యంలో BC లకు వారి జనాభా ప్రకారం 52% రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మండల కేంద్రములో చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు వర్దవెళ్ళి స్వామిగౌడ్ హాజరై తాను ఒక BC కనుక వారే మొదటి సంతకం చేసి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభ అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా మెజారిటీ ప్రజలైన బీసీ కులాల ప్రజలు రాజకీయ ఉద్యోగ వ్యాపార ఆర్థిక మరియు సాంస్కృతిక రంగాలలో ఈనాటికి అత్యంత వెనుకబడి ఉన్నారంటే ఇన్నాళ్లుగా దేశాన్ని ఏలిన పాలక పార్టీల ప్రణాళిక బద్ద కుట్రే కారణం అని అన్నారు.అదేవిధంగా భారతదేశంలో మరియు తెలంగాణ రాష్ట్ర మొత్తం జనాభాలో బీసీల జనాభా దాదాపు 54 శాతం ఉంది కానీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు అందించిన భారత రాజ్యాంగం ప్రకారం పొందవలసిన అవకాశాలు హక్కులు జనాభా ప్రకారం కాకుండా కేవలం 27 శాతానికి మాత్రమే పరిమితం చేయబడిందని, రాజ్యాంగంలో 340 ఆర్టికల్ బీసీల కోసం చేర్చి బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు కాంక్షించారు. కానీ ఆనాటి మొదటి ప్రధాని నెహ్రూ ప్రభుత్వం అమలు చేయలేదు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు దానికి నెహ్రూ ప్రభుత్వంతో బీసీ రిజర్వేషన్ అమలు కోసం పోరాడారు కాని దానికి తగిన విధంగా ప్రభుత్వం స్పందించకపోవడంతో తన కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారని ఆయన అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో 1978లో భారత ప్రభుత్వం బీపీ మండల్ గారి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు అయితే దేశవ్యాప్తంగా బీసీల స్థితిగతులపై 1978లో నివేదిక భారత ప్రభుత్వానికి సమర్పించగా ఒక దశాబ్ద కాలం పాటు మండల కమిషన్ యొక్క ఆదేశాలను అమలు చేయలేదని, 1990లో బహుజన్ సమాజ్ పార్టీ దేశమంతా మండల్ మార్చ్ ఉద్యమం చేసి దేశ రాజధాని ఢిల్లీలో లక్షల మందితో భారీ బహిరంగ సభ పెట్టింది, అదే వేదిక నుండి మాన్యవర్ కాన్షీరాం గారు ప్రసంగిస్తూ మండల్ కమిషన్ నివేదికను అమలు చేయండి లేదా కుర్చీ ఖాళీ చేయండి అనే నినాదం ఇస్తూ మండల్ కమిషన్ అమలు చేసే వరకు అక్కడ నుండి కదిలేది లేదు అని 48 రోజులపాటు ప్రతిరోజు 10,000 మందితో పార్లమెంట్ ముందు ధర్నా చేస్తే, దిగి వచ్చిన ఢిల్లీ ప్రభుత్వం 27% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించింది ఇది బహుజన ఉద్యమం సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. అధికారం రాకముందు మా ప్రభుత్వంలో కులగణన చేస్తామని పార్లమెంట్లో ప్రకటించిన బిజెపి, బీసీ కార్డుతో ప్రధానమంత్రి అయిన మోడీ ప్రభుత్వం అదే పార్లమెంట్ సాక్షిగా మేము బీసీ కులాల జనాభా లెక్కింపు చేయమని ప్రకటించడం అంటే ఇప్పటికీ బీసీ కులాలు తమ కింద నక్కి ఉండే బానిసలని చెప్పడమే దేశ జనాభాలో మెజారిటీగా ఉండి ఈ దేశం మెజారిటి హక్కుదారులైన బీసీల పట్ల ఇంతటి నిర్లక్ష్య వైఖరికి కారణం, దేశ ప్రధాని నరేంద్ర మోడీ అసలైన బీసీ కాకపోవడమే అని తేలియ జేశారు.మన రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, ఝార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక రాష్ట్రాలలో అమలు చేస్తున్న విధంగా మన రాష్ట్రంలో కూడా అమలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్న బీసీల లెక్కింపు చేయకపోవడం సిగ్గుచేటని బీసీల పట్ల వారికున్నటువంటి వివక్షతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. 9 సంవత్సరాల కాలంలో బీసీ కార్పోరేషన్ ,కమీషన్ లు ఏర్పాటు చేయకుండా బీసీలను మోసం చేస్తూ వస్తుందని ఇక మీదట మీ ఆటలు సాగవని హెచ్చరించారు.52 % రిజర్వేషన్ అమలు చేసేంతవరకు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తుందని, అందుకనుగుణంగా రాష్ట్ర రథసారధి మన ప్రియతమ నేత డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించారని దినికి సబ్బండ కులాల ప్రజలు ముందుకు వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు…ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి యారపు రాజబాబు, మండల ప్రధాన కార్యదర్శి షేక్ హైదర్,మండల కోశాధికారి కొప్పెల్లి రాజు, మండల కార్యదర్శులు బొడ్డు కిషన్, అందె ఈశ్వర్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
