
ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 31, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్న 30 వ జాతీయ పిల్లల వైజ్ఞానిక సదస్సు (30 th National children’s science Congress) లో పాల్గొన్న మా విద్యార్థిని కుమారి దీటి అక్షయ ను ఆ రాష్ట్ర Gujcosp, advisor and member, secretary నరోత్తం సాహా, J.V. Nadar gujrat science City director మరియు Surender Benerjee director-general of Gujarat biotechnical University వారు అభినందించారు. ఐదు రోజులు గా జరుగుతున్న ఈ సదస్సు లో మా విద్యార్థిని “కాలుష్యగాలి నుండి సహజవాయువు” ఉత్పత్తి చేయు project ని సమర్పించిన నేపథ్యంలో మా విద్యార్థిని దీటి అక్షయకు అతిథులు జ్ణాపికను పథకాన్ని బహూకరించారు. ఈసందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఈసరి రవీందర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇలాంటి వేదికలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ఉపాధ్యాయులు గట్టి క్రుషి చేసినట్లయితే మరింతమంది విద్యార్థులు బాలమేధావులుగాను భవిష్యత్తులో జ్ణానత్రుష్ణ ను పెంపొందించుకొని సమాజహితైషులుగా ఎదుగుతారని అభిప్రాయపడుతూ ఈ సందర్భంగా మా పాఠశాల పేరును జాతీయ స్థాయిలో ప్రస్ఫుటించేవిధంగా ప్రావీణ్యాన్ని చూపిన దీటి అక్షయకు మరియు గైడ్ టీచర్ రాజ్ మహ్మద్ SA Physics అకుంఠిత దీక్ష పట్టుదల మూలంగానే మా పాఠశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధ్యమయిందని తెలుపుతూ విద్యార్థిని కి గైడ్ టీచర్ కు అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్, శారదా దేవి, ఉమామహేశ్వరి, రమణ, శంకరయ్య, లక్ష్మణ్, తిరుపతి, శంకర్, స్వప్న, రేణుక తదితరులు పాల్గొన్నారు.




