
జగదేవపూర్ మండల పరిధిలోని శ్రీ కొండపోచమ్మ దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. జాతర రెండవ వారం కావడంతో మంగళవారం భక్తుల తాకిడి పెరిగింది.కొమురవెల్లి మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న భక్తులు కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకునే ఆనవాయితిని కొనసాగుతుండడంతో ఆదివారం కొమురవెల్లి వచ్చి అక్కడ స్వామివారిని దర్శించుకొని తర్వాత సోమవారం మరియు మంగళవారం కొండపోచమ్మ సన్నిధికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా ఆలయ పరిసర ప్రాంతమంతా భక్తులతో నిండి పోవడంతో భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయం వద్ద కనీస సౌకర్యాలైన తాగు నీరు మరియు మరుగు దొడ్ల సౌకర్యాలకు ఇబ్బంది పడుతున్నారు. కావున వీటికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని భక్తులు కోరుతున్నారు.




