– సర్వాయి పాపన్న జీవితం యువతకు ఆదర్శం
దౌల్తాబాద్: స్వాతంత్ర్య సమర యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని మండల పరిధిలోని మహ్మద్ షాపూర్ గ్రామంలో పాపన్న గౌడ్ చిత్ర పటానికి సర్పంచ్ స్వప్న, గౌడ కులస్తులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వాయి పాపన్న జీవితం యువతకు ఆదర్శంగా నిలువాలన్నారు. ఔరంగజేబుకు తెలంగాణ దెబ్బ రుచి చూపించి కొన్ని నెలలుగా గోల్కొండ కోటను ఏలిన మహా యోధుడు చక్రవర్తి మన పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ షాపూర్ గౌడ కులస్తులు, గ్రామ కుల సంఘాలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.