ప్రాంతీయం

శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు మంచిర్యాల జోన్ పరిధిలో పోలీస్ నాకాబంది

65 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

*శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు మంచిర్యాల జోన్ పరిధిలో పోలీస్ నాకాబంది*

*మద్యం సేవించి డ్రైవింగ్‌కు చెక్….రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ చర్యలు*

రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ ఉత్తర్వుల ప్రకారం మంచిర్యాల జోన్ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు ఒకేసారి నాకాబంది లో భాగంగా వాహనాలను తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో అక్రమ రవాణా,ప్రభుత్వ నిషేధిత పదార్థాలు రవాణా, అనుమానిత వ్యక్తుల కట్టడి, నేరాల నియంత్రణ, అవాంఛనీయ సంఘటనలను అరికట్టడానికి, అనుమానితులు, దొంగిలించబడిన వస్తువులు,సరైన పత్రాలు లేని వాహనాలను పట్టుకోవడానికి, భాగంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా కార్యకలాపాలు జరగకుండా కట్టడి చేయడంతో పాటు, దొంగతనాలు,చైన్ స్నాచింగ్ లు వంటి ఇతర నేరాలను నివారించేందుకు ఈ తనిఖీలు నిర్వహించడం జరిగింది.నాకాబందీ సమయంలో అనుమానిత వ్యక్తులు మరియు అనుమానాస్పద వాహనాలను ఆపి సమగ్రంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్,డ్రైవింగ్ లైసెన్స్,ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పొల్యూషన్ వంటి ధ్రువ పత్రాలను పరిశీలించారు.డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్,ట్రిపుల్ రైడింగ్,మైనర్ డ్రైవింగ్,సెల్ ఫోన్ డ్రైవింగ్,హెల్మెట్ లేని వారు, వాహన ధ్రువ పత్రాలు లేని వారిపై పోలీస్ అధికారులు కేసులు నమోదు చేసి,జరిమానా విధించి వారికి రోడ్డు సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా వాహనదారుల వివరాలు,వారు వెళ్లే ప్రదేశం వివరాలు, వాహనాలలో ఉన్న వారి వివరాలు తెలుసుకోవడం జరిగింది. రామగుండం కమీషనరేట్
మంచిర్యాల జోన్ లో శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధానికి సంబంధించి ఈ నాకాబంధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ ప్రక్రియను రాబోయే రోజుల్లో కూడా నిర్వహించి, ఇలాంటి తనిఖీలు మరింత కఠినంగా కొనసాగిస్తామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని మంచిర్యాల జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *