హెల్మెట్ ధారణతో ప్రాణాలు నిలుస్తాయి.
బైక్ పై కిందపడి గాయాల పాలైన యువ కుడికి హెల్మెట్ ప్రదానం చేసిన రూరల్ సి ఐ ఉపేందర్.
ద్విచక్ర వాహన దారులు విధిగా హెల్మెట్ ధరించాలని ప్రమాద వశాత్తూ బైక్ నుండి క్రింద పడ్డా,ప్రమాదం జరిగినా తలకు గాయాలతో ప్రాణాలు పోతాయని సిరిసిల్ల రూరల్ సి ఐ ఉపేందర్ తెలిపారు.
తంగళ్ల పల్లి మండలం బద్దెన పల్లి గ్రామానికి చెందిన పన్యాల శ్రీనివాస్ రెడ్డి ఇటీవల వేముల వాడ కు ద్విచక్ర వాహనం పై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తుండగా బైక్ పై నుండి క్రింద పడ్డాడు.దీంతో ఆయనకు ఆయన తీవ్రంగా గాయపడి కొలుకున్నట్లు తెలుసుకున్న సిరిసిల్ల రూరల్ సి ఐ ఉపేందర్ తన కార్యాలయానికి శ్రీనివాస్ రెడ్డి నీ పిలిపించుకొని అతనికి హెల్మెట్ ప్రదానం చేశారు.వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి వాహనాలు నడు పాలని , హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే సందర్భంలో ప్రమాదాలు జరిగి ముందుగా తలకు గాయాలు అవుతాయని,ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి కుటుంబాలకు పెద్ద దిక్కు ను లేకుండా అయ్యి కుటుంభం అన్ని విధాలా ఇబ్బందులు పడే పరిస్థితి వుంటుందని తగిన జాగ్రత్తలతో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ విధిగా ధరించాలని ద్విచక్ర వాహన దారులకు సిరిసిల్ల రూరల్ సి ఐ ఉపేందర్ అవగాహన కల్పించారు.
