– మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
దళితులు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మానకొండూర్ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ అన్నారు.
గన్నేరువరం మండలంలోని చోక్కారావుపల్లి గ్రామంలోని దలితకాలనీలో ఈరోజు ఆయన విస్తృతంగా పర్యటించి, దళితుల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకుంటూ సత్వరమే పరిష్కరించారు.
అనంతం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇళ్లులేని వారికి గృహాలక్ష్మి పథకం ద్వారా రూ.3 లక్షల సాయం చేయడం జరుగుతుందని వివరించారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే ఉన్న సంక్షేమ పథకాలలో కోత పెట్టడమేనని 2016 లో ఉన్న ఆసరా పెన్షన్ ను రూ.200లు చేస్తారని, కాంగ్రెస్ నాయకుల బోగస్ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని హెచ్చరించారు.
పగటి వేశగాళ్లు ఊర్లమీద పడి ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని, ఎన్నికలు రాగానే ప్రజలు గుర్తుకు వస్తున్నారని, ఐదేళ్లు గుర్తుకు రాని ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లకు గుర్తుకు వచ్చారా అని దుయ్యబట్టారు.
చొక్కారావుపల్లి గ్రామంలోని దలిత కాలనీ ప్రజల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడం జరుగుతున్నదని పేర్కొన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయం వంటి సమస్యలను పరిష్కరించడం జరుగుతున్నదని పేర్కొన్నారు.
చొక్కారావుపల్లి దలితులు ఆర్థికంగా అభివృద్ధి చెందలనే లక్ష్యంతో దళితబంధు పథకం ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరేలా యూనిట్ ఏర్పాటు చేసి దళితులకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్లు అందజేయడం జరుగుతున్నదని, భర్తలు చనిపోయిన వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు.
గ్రామంలో మూతబడిన ప్రభుత్వ పాఠశాలను తెరిచే విధంగా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఓట్ల కోసం ఊర్లమీద పడే పగటి వేశగాళ్ల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఎమ్మెల్యే రసమయి కోరారు…
ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండలం జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.