*మంత్రి కే టి ఆర్ ప్రత్యేక చొరవతో..*
*మోడల్ స్కూల్ లకు చిరునామా గా సిరిసిల్ల ప్రభుత్వ బడులు*
సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్రభుత్వ పాఠశాలలు
నేడు( ఫిబ్రవరి 1 న) మన ఊరు – మన బడి ప్రారంభోత్సవాలు
కార్పొరేట్ స్కూళ్లను తలపిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు
జిల్లాలో విద్యార్థులకు సౌకర్యంగా సర్కారు స్కూళ్లు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 172 స్కూళ్లలో పనులు
సర్కారు బడుల అభివృద్ధియే లక్ష్యంగా పేద, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి.
*మంత్రి కే తారక రామారావు ప్రత్యేక చొరవతో* *కార్పొరేట్ కు ధీటైన సౌకర్యాలు,రూపు రేఖలతో సరికొత్త సొబగులు అద్దుకుని*
*మోడల్ స్కూల్ లకు చిరునామాగా సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలలు నిలుస్తున్నాయి.*
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 511 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా మన ఊరు మనబడి కార్యక్రమం కింద మొదటి విడత 172 స్కూల్ లలో సుమారు 50 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో
మౌలిక సదుపాయాల పనులను చేపట్టారు.
పనులన్నీ పూర్తి చేసుకొని నేడు ( ఫిబ్రవరి 1న) ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. మన ఊరు – మనబడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడత లో ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యంతోపాటు మరుగుదొడ్లు, హ్యాండ్‌వాష్, ఫ్లోరింగ్, గ్రీన్ బోర్డులను ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల అదనపు తరగతి గదుల నిర్మాణంతోపాటు లైబ్రరీ, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లను నిర్మించారు.
జిల్లాలోని ప్రతి మండలానికి రెండు పాఠశాలల చొప్పున 13 మోడల్ స్కూల్ గా ఎంపిక చేసుకొని అభివృద్ధి పనులను పూర్తి చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడతలో పూర్తి అయిన ప్రభుత్వ పాఠశాలలు కొత్త రంగులద్దుకొని సుందరంగా తయారయ్యాయి.
మంత్రి కే తారక రామారావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మార్గదర్శనంలో
మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో తోలి విడత ఎంపిక చేసిన 172 ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తరగతి గదుల్లో ఫ్యాన్లు, ఇతర మరమ్మతులు చేపట్టాం. దాదాపు అన్ని పాటశాలలో పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.





