బాధిత కుటుంబానికి అండగా ఉండి తమ వంతు సహకారం అందిస్తామని బీజేపీ సీనియర్ నాయకులు మంతుర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఇటీవల నిరుపేద కుటుంబానికి చెందిన రైతు లాలు ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకొని బీజేపీ సీనియర్ నాయకులు మంతుర్ ప్రభాకర్ రెడ్డి సోమవారం రైతు కుటుంబాన్ని పరామర్శించి, 5,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం మృతుని కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నరేష్ గౌడ్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు కృష్ణ, మండల సినియర్ నాయకులు హరికృష్ణ గౌడ్, బూత్ అధ్యక్షులు శేఖర్, సాయి గౌడ్, నాయకులు నాగరాజు, బాలరాజు, ప్రసాద్, నరసింగ్ రావు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.




