ప్రాంతీయం

స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై ఆరా తీసిన మంత్రి కేటీఆర్…

529 Views
ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 31, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనపై మంత్రి కేటీఆర్ గారు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తో ఫోన్లో మాట్లాడారు.
గాయపడిన విద్యార్థుల వివరాలు అడిగి తెల్సుకున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమయితే హైద్రాబాద్ కి తరలించాలని సూచించారు. పాఠశాల బస్ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ అరా,విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లా విద్యాధికారి ఆదేశించిన కలెక్టర్. ఎల్లారెడ్డి పేటలో విజ్ఞాన్ పాఠశాల బస్ ను ఆర్టీసి బస్ డి కొట్టిన ప్రమాదం పై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అరా తీశారు. సంఘటనకు సంభందించిన సమాచారాన్ని జిల్లా విద్యాధికారి రాదా కిషన్ ను  అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాధికారి నీ కలెక్టర్ ఆదేశించారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *