ముస్తాబాద్, నామాపూర్ గ్రామంలోని స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయం
వద్ద గౌడ కులస్తులు సమావేశం నిర్వహించి కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా గౌడ కుల బాంధవులు గ్రామంలో ఆదివారం సెప్టెంబర్ 30న ఉత్తముడుగా పేరుగాంచిన మేరుగు అంజగౌడ్ ను గౌడ సంఘం సమక్షంలో ఏకగ్రీవంగా అధ్యక్షునిగా నియామకం జరిపించి సగౌరవంగా శాల్వాతో సన్మానించారు. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా గున్నాల రాజుగౌడ్, కోశాధికారి కంచర్ల శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈకార్యక్రమంలో గౌడ సంఘ కులస్తులు, తదితరులు పాల్గొన్నారు. వీరికి సహాయకులుగా సోషల్ మీడియా వార్యర్ నరేంద్రచారి టైపర్గా పనిచేశారు.




